ఢిల్లీ ధర్నా విశేషాలు వెల్లడించిన శ్రీమాన్ తాడూరి
పెద్దపల్లి ప్రజాబలం ఏప్రిల్ 5÷
ఏప్రిల్ 3 4 తేదీలలో దేశ రాజధాని అయిన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమాలు విజయవంతమైనట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ వెల్లడించారు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి పెద్దపల్లి చేరుకొని బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ఢిల్లీ విషయాలను పాత్రికేయులకు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి హనుమయ్య తాడూరు శ్రీమన్నారాయణ సంయుక్తంగా మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీలకు మంచి రోజులు రానున్నాయని అని తెలిపారు. చట్టసభలలో 50% రిజర్వేషన్లు సాధించే దిశలో ఉద్యమ నిర్మాణం బలోపేతం అవుతుందని అన్నారు. కృష్ణయ్య నేతృత్వంలో దేశ రాజధానిలో ఐదు లక్షల మంది బీసీ ప్రతినిధులతో త్వరలో ఒక సభ ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. ప్రధానమంత్రి మోడీ బీసీల సంఘటితశక్తిని గమనించి కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో మన వాటా మనకు దక్కాల్సిన 2 లక్షల కోట్లు కేటాయింపులు జరిపే వరకు ఉద్యమ నిర్మాణం దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమైన వని వారన్నారు. బీసీలపై ఉన్న క్రిమిలేయర్ ని ఎత్తివేసి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో బీసీలకు రిజర్వేషన్లు సాధించే దిశలో అడుగులు పడుతున్నాయని అన్నారు. ఢిల్లీలో రెండు రోజుల జరిగిన ధర్నా కార్యక్రమాల వల్ల బీసీ సమస్యలపై ప్రాంతీయ జాతీయ పార్టీలు ఆలోచన విధానం సానుకూలంగా ఉండని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి హనుమయ్య తో పాటు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వింజమూరు సురేష్, కనుకుంట్ల నాగరాజు, సతీష్, బొద్దుల అరుణ, స్వరూప, మనోరమ, లక్ష్మి, నిర్మల, వెంకటేష్, శ్రీనివాస్, రాజేష్ తదితరులు ఉన్నారు