జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి డిసెంబర్ 10
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు తో కలిసి వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా ఫార్మసీ రూమ్, లేబర్ రూమ్, ల్యాబ్ లను పరిశీలించడం జరిగింది. ఎన్ సి డి క్లినిక్స్ ను పగడ్బందీగా నిర్వహించాలి అందులో ఎన్ సి డి పరీక్షలు హైపర్ టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్ ,ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు నిర్వహించాలి. లెప్రసి సర్వేను ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలో విధిగా నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించాలి అని దిశా నిర్దేశం చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సిజేరియన్ ఆపరేషన్ లను అవసరం మేరకు నిర్వహించాలని ఏ బి హెచ్ ఏ కార్ట్స్ ను ఇంప్రూవ్ చేయాలని,
సిబ్బంది సమయపాలన పాటించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలందరూ ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు, జమ్మికుంట సూపర్డెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి,డాక్టర్ రాజేష్ వావిలాల,శ్యాం కుమార్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ , హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్, మోహన్ రెడ్డి, సూపర్వైజర్ కుసుమకుమారి,ఫార్మసిస్ట్ శ్రీధర్, స్టాఫ్ నర్స్ సాయి,ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.