అత్యాధునిక హంగులతో మహిళ ఐటిఐ కళాశాల

 

ఐటి మరియు పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 10:విద్యార్థులకు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞాన్ని అందించడంతోపాటు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని ఐటి మరియు పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండలంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఐటిఐ మహిళా కళాశాలను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి లతో కలిసి మంగళవారం మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా నూతన నిర్మాణాలు చేపట్టిన ఐటిఐ కళాశాలలను ప్రారంభించుకుంటున్నాము. ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని అందులో భాగంగానే రాష్ట్రంలో అధునాతన పరిజ్ఞానంతో కూడిన ఐటిఐ కళాశాలలో నిర్మించడం జరుగుతుందన్నారు ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మహిళా సాధికారత దిశగా ఘట్కేసర్ మండలంలో మహిళల కోసం నిర్మించిన ఐటిఐ కళాశాలను ప్రారంభించడం ఎంతో హర్షనీయమన్నారు భవిష్యత్తులో ఉపాధి పొందే దిశగా అధునాతనమైన ట్రైన్లకు సంబంధించి పరికరాలతో కూడిన తరగతి గదులను అధునాతన పరికరాలతో నిర్మించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు మహిళలకు అవసరమైన విభాగాలలో విభాగాలను గుర్తించి అందుకు అనుగుణంగా తరగతి గదులను పరికరాలతో నిర్మించి వారికి విషయపరిజ్ఞానం పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు మహిళలకు అవసరమైన ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు మిషనరీ తో పాటు కొత్త కొత్త హంగులతో ఏ విధంగా తయారు చేయాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మంత్రి ఉదాహరణగా సూచించారు అనంతరం మంత్రి కళాశాల ప్రాంగణంలో మొక్క నాటారు తరువాత ఘట్కేసర్ లోని లోని గురుకుల్ జూనియర్ కాలేజీలో ఒక కోటి 50 లక్షల అభివృద్ధి పనులను శంకుస్థాపన గావించారు, అక్కడే సీఎం కప్ ఆటలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ గౌతం పోత్రు, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీవో సైదులు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా స్థాయి మరియు మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking