ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ హెల్త్ డైరెక్టర్

 

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 13జమ్మికుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల పరిధిలోని జమ్మికుంట-2 ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్.రవీంద్ర నాయక్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ లు ఆకస్మిక తనిఖీ చేసినారు. గర్భిణీలకు, చిన్న పిల్లలకు మహిళలకు అందుతున్నటువంటి సేవలు,వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పరిశీలించి వైద్య సిబ్బంది పని తీరును ప్రశంసించారు.ఆరోగ్య కేంద్రానికి సంబందించిన వివిధ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య సేవల కోసం వచ్చే వారికి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు సలహా సూచనలు వైద్య సిబ్బందికి తెలిపారు.అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం వైద్య సిబ్బంది ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్, కరీంనగర్ జిల్లా డి ఎం హెచ్ వెంకటరమణ తో హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందునాయక్, ఎన్ హెచ్ ఎం డి పి ఓ స్వామి, వావిలాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, మహోన్నత పటేల్, సిహెచ్ఓ శ్యామ్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ అరుణ,ఏఎన్ఎం మంజుల, రజిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

             

Leave A Reply

Your email address will not be published.

Breaking