పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు ముందుటా..
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 16: ఉద్యోగులు, పెన్షనర్లు ఎందరో పోరాటాల ఫలితంగా రాష్ట్రం సిద్దించిందని రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లి ప్రభుత్వం ఏర్పదిందని, ఉద్యోగుల, పెన్షనర్ల కై జగిత్యాల లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా వారి కార్యాలయంలో 5 లక్షలతో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మొత్తం లో పెన్షన్ లు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల కు జీతాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం పాలియేటివ్ కేర్ యూనిట్ ను ఏర్పాటు చేసుకున్నామని స్వయంగా ఇంటీ కి వెళ్లి సేవలు సైతం అందిస్తారన్నారు. రాష్ట్రంలోని 29 లక్షల విద్యార్థులకు సన్న బియ్యం అందిస్తూ 1000 పైగా గురుకులాలు ఏర్పాటు ద్వారా పేద మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు 5 లక్షల మంది విద్యార్థులకు విద్యా వసతి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏటా ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివే 18 లక్షల మంది విద్యార్థులకు 2 వేలకోట్లు చొప్పున ఇప్పటి వరకు మొత్తం గా 18 వేల కోట్లు నిధులు వెచ్చించడం జరిగింది అని అన్నారు. వైద్య పరంగా ఏ అవసరం ఉన్న అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని ఎల్లపుడు మీ ఆశీర్వాదం ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయించడం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.
నేడు జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా తయారయిందన్నారు.
సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ద్వారా 50 రకాల జిల్లా కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి తద్వారా ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలిగిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో 5 జూనియర్ కళాశాలలు, ఒక మహిళ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మొన్న డిసెంబర్ నాటికి 14 వేల మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు.

20 కోట్లు నిధులతో అధునాతన సౌకర్యాలతో పొలాస వ్యవసాయ కళాశాల అదునికరించుకోవడం జరిగిందన్నారు.
రైతులకు, మహిళలకు, విద్యార్థులకు,ఉద్యోగులకు, జర్న లిస్ట్ లకు ఇలా అన్ని వర్గాల వారి అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎల్లా గంగ రాజం, ప్రధాన కార్యదర్శి కరబుజ రవీందర్, కోశాధికారి మల్లి ఖార్జున్,రాష్ట్ర కౌన్సిలర్ అశోక్ రావు, అసోసియేట్ అద్యక్షులు సత్యనారాయణ, యూనిట్ 1 అద్యక్షులు కొలిచాల రవీందర్, విటలయ్య, యూనిట్ 2 అద్యక్షులు బాలమురలి కృష్ణ, కార్యదర్శి అంజయ్య, అసోసియేట్ అద్యక్షులు గుండేటి రవీందర్, కౌన్సిలర్ లు కుసరి అనిల్, ముస్కు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.