మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 16 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు మండల ప్రజాపరిషత్ ప్రాథమిక  పాఠశాల, జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో  మన వూరు మన బడి పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  స్నేహలత మొగిలి గురువారం తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా ఆమె పనుల పురోగతిని పరిశీలించి పనులను వేగవంతం చేసి త్వరితగతిన  పూర్తి చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు . విద్యార్థుల హాజరు శాతం,  తరగతి గదిలో విద్యార్థుల బోధనా సరళిని పరిశీలించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సరళీకృతంగా   బోధనా ఉండాలని ఉపాద్యాయులకు సూచించారు

అదనపు కలెక్టర్ వెంట మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాద్యాయులు, ఉపాద్యాయులు తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking