జిల్లాస్థాయి చెస్ పోటీలను ప్రారంభించిన నగర మేయర్ జిల్లా కలెక్టర్

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 16 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ వారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల జిల్లా స్థాయి చెస్ పోటీలను గురువారం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి ప్రారంభించారు.  ఈ చెస్ పోటీలలో 150 మంది మహిళా చెస్ క్రీడా కారులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్, నగర మేయర్ లు క్రీడాకారుల తో చెస్ ఆడి ప్రారంభించుట జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు తమ ప్రతిభను చాటి, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ఫలితాలను తేవాలని తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని చెస్ టోర్నమెంట్లను నిర్వహించి పాఠశాల, కళాశాలల విద్యార్థులలో ప్రతిభ కలవారిని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. మొదటి, రెండవ స్థానంలో గెలుపొందిన వారు నేడు (శుక్రవారం) రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు పంపించటం జరుగుచున్నదని ఆయన తెలిపారు. కొత్తగా మునిసిపల్ కార్పోరేషన్ లో ఏర్పాటు చేసిన చెస్ పార్క్ ను క్రీడాకారులు వినియోగించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్జిఎఫ్ కార్యదర్శి కె. నరసింహ రెడ్డి వారి శ్రీమతి వనిజ రెడ్డి  జ్ఞాపాకార్ధం 60 టీ షర్టులను ప్రభుత్వ పాఠశాలల క్రీడాకారులకు జిల్లా కలెక్టర్, నగర మేయర్ లతో ఉచితంగా పంపిణీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులకు ఈ సందర్భంగా సర్టిఫికెట్ ల ప్రదానం చేశారు.

ఈ చెస్ పోటీలలో మొదటి విన్నర్ గా జి. చరిష్మా, ఖమ్మం రూరల్, రెండవ విన్నర్ గా డి. దివ్య మధిర, మూడవ విన్నర్ గా పి. సేతు శ్రీవల్లి ఖమ్మం, నాలుగవ విన్నర్ గా కె. కీర్తన ఖమ్మం లు నిలిచారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా విద్యాధికారి సోమ శేఖర్ శర్మ, డివైఎస్ఓ పరంధామ రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఇఓ శ్రీనివాస్, చెస్ కోచ్ గోపి కృష్ణ , పిడి రఘునందన్ రావు, వాలీబాల్ కోచ్ ఎండి. అక్బర్ అలీ, బాస్కెట్ బాల్ కోచ్ కె. సైదులు, టెన్నిస్ కోచ్ కైలాష్, స్కెటింగ్ కోచ్ సురేష్, షటిల్ కోచ్ పవన్, టేబుల్ టెన్నిస్ కోచ్ మూర్తి, ప్రభుత్వ పాఠశాలల పిఇటిలు,  సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking