కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రోమ్ము, గర్భశయ ముఖద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. టి.రఘునాథస్వామి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 7:
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తద్వారా వ్యవస్థ అంతా ఆరోగ్యంగా ఉంటుందని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు రాధికాగుప్తా అన్నారు.
శుక్రవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రోమ్ము, గర్భశయ ముఖద్వారా క్యాన్సర్ పై నిర్వహించిన హెల్త్ క్యాంపుకు అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, విజయేందర్ రెడ్డి లు హజరయ్యారు.ఈ క్యాంపుకు హజరైన అదనపు కలెక్టర్లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిరఘునాథ స్వామి పుష్పాలు అందించి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాధికా గుప్తా మాట్లాడుతూ మెడికల్ డిపార్ట్ మెంట్ వారు మెడికల్ క్యాంపు ఉచితంగా వైద్య చికిత్సలు, పరీక్షలు అందించడం ఎంతో హార్షనీయమని అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది అందరుఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని అవసరమైన పరిక్షలు అన్ని చేయించుకోవాలని సూచించారు. మహిళ ఉద్యోగులు ఇంటి పనులు, కార్యాలయ విధులలో నిమగ్నమై తమ ఆరోగ్యం పట్ల కొంత నిర్లక్ష్యం వహిస్తారని, ముఖ్యంగా వారి కోసంఈ మెడికల్ క్యాంపు ఎంతో ఉపయోగకరమన్నారు. మహిళ ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టితో రోమ్ము, గర్భశయ ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఎంతో ఖరీదుతో కూడుకున్నవైనప్పటికి వైద్య శాఖ వారు మహిళ ఉద్యోగులకు ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ క్యాంపును కలెక్టరేట్ సిబ్బంది అందరు వినియోగించుకొని తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సూచించారు. మెడికల్ క్యాంపులో అధిక సంఖ్యలో సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు రక్త పరీక్షలు, బిపి పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం జిల్లా వైద్య శాఖాధికారి రఘునాథస్వామి మాట్లాడుతూఈ ఉచిత మెడికల్ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, డెర్మాటలజీ, డెంటల్,రేడియాలజీ విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్, స్వతవ క్యాన్సర్ కేర్ వారి భాగస్వామ్యంతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ వైద్య శిబిరంలో 224 మంది ఉద్యోగులు పాల్గొనగా, 448రక్త నమునాలు తీసుకున్నామన్నారు. 61 మందికి సర్వైకల్, 124 మందికి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు.
ఈ మెడికల్ క్యాంపులో డిఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.