రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 7 ఫిబ్రవరి 2025
మణికొండ పరిధి లోని అల్కాపూర్ టౌన్షిప్ వాసులు మంచినీటి సదుపాయం కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు మూడు సంవత్సరాల తర్వాత అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్కులో నిర్మించిన 2. 5 మిలియన్ లీటర్ల కెపాసిటీ గల మంచినీటి రిజర్వాయర్ను మొదలు పెట్టడం ఎంతో హర్ష దాయకమని బి.ఆర్.ఎస్ పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియజేస్తూ వాస్తవానికి ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించి అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.టీ.ఆర్ ఇంటింటికి మంచి నీరు అందించే మిషన్ భగీరథ ఫేస్ 2 కార్యక్రమం 23 జనవరి 2022 న 587 కోట్లతో పలు మండలాలకు మంచినీరు అందించడం కొరకు రిజర్వాయర్ లను ప్రారంభించడం, అందులో భాగంగా అల్కాపూర్ టౌన్షిప్ లో కూడా పునాదిరాయి వేయడం జరిగింది. కానీ దురదృష్ట అంశం ఏమంటే పునాదిరాయి వేసిన మరుసటి రోజే స్థానిక కాలనీల సంక్షేమ సంఘాం సమాఖ్యలోనీ కొంతమంది స్పోర్ట్స్ పార్కులో రిజర్వాయర్ని నిర్మించడం వ్యతిరేకించి గౌరవ హైకోర్టును ఆశ్రయించి స్పోర్ట్స్ పార్కులో నిర్మింప తలపెట్టిన మంచినీటి రిజర్వాయర్ను అడ్డుకోవడం జరిగింది. మంచినీటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అప్పటి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరియు ఎం.పీ వి. రంజిత్ రెడ్డిల సూచన మేరకు మణికొండ మంచినీటి సాధన సమితి పేరిట అల్కాపూర్ టౌన్షిప్ లో ఉన్న స్థానిక నాయకులను కూడ గట్టుకొని దాదాపు 450 సంతకాలు సేకరించి హైకోర్టు పిటిషన్ లో జవాబు వేసి పరిస్థితినీ తెలియ జేయడం జరిగింది. దాదాపు పది నెలల తర్వాత మంచినీటి రిజర్వాయర్ కట్టడానికి వ్యతిరేకంగా వేసిన పిటీషన్ కొట్టి వేయడంతో తిరిగి రిజర్వాయర్ పనులు ప్రారంభించి పూర్తి చేసుకోన్నను మొదలు పెట్ట నందున గడచిన నాలుగు నెలల్లో బి.ఆర్.ఎస్ పార్టీ తరఫున పలుమార్లు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను కలసి అల్కాపూర్ టౌన్షిప్ రిజర్వాయర్ తో పాటు కృష్ణారెడ్డి నగర్ లో గల 0.5 మిలియన్ లీటర్ల కెపాసిటీ రిజర్వాయర్ కూడా ప్రారంభించమని చెప్పడం జరిగింది. అట్లాగే నెమలి నగర్ లో స్థల సేకరణ జరిగిన చోట 0 .5 మిలియన్ లీటర్ల కెపాసిటీ రిజర్వాయర్ నిర్మించమని డిమాండ్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆనాడు సంతకాల సేకరణలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మణికొండ మంచినీటి సాధన సమితి కి సహకరించిన ప్రతి ఒక్కరికి, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారికి మరియు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కుంటున్నానీ సీతారాం ధూళిపాళ పత్రికా ముఖంగా తెలియ జేస్తూ మా యొక్క డిమాండ్ లో ఉన్న మిగితా పనులు కూడా పూర్తి చేయాలని మనవి.