మణికొండ జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యత.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 7 ఫిబ్రవరి 2025
భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో ఓక్రిడ్జ్ స్కూలు విద్యార్థులు అర్జున్, రిత్విక్, దివ్యాన్ష్ లు మణికొండ గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పిస్తూ ఇక ముందు అందరూ కలసి కట్టుగా ఆడుకోవడానికి గాను క్రికెట్ బ్యాట్లు, బంతులు, వికెట్లు, బ్యాడ్మింటన్ రాకెట్లు, ఫుట్ బాలులు, వాల్లి బాలులు, చేస్ బోర్డు, కాయిన్లు తది తర క్రీడా సామగ్రిలతో పాటు ఒక సైకిల్ బహుకరించడ మైనది, ఈ సందర్భముగా పాఠశాల ప్రధనోపాధ్యాయుడు నిరంజన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చదువులలో మండల స్థాయిలోనే ముందంజలో ఉన్నారని, చదువులతో పాటు క్రీడలలో కూడా చురుకుగా పాల్గొంటూన్నారని మచ్చుకు వివిధ టోర్నమెంట్ లలో మొదటి స్థానం కైవసం చేసుకున్న వారి వివరాలు: చేస్ కంప్టిషన్ లో సాత్వికా నిహరి, 600 మరియు 300 మీటర్ల అండర్ 14 లాంగ్ జంప్ లో హరనాథ్ రెడ్డిలు, షార్ట్ పుట్ లో భరత్, 400 మీటర్ల రన్నింగ్ లో చంద్ర మోహన్, యోగా కంప్టీషన్ లో రమేష్, ఆడపిల్లల యోగా కంప్టీషన్ లో దీపికా, అట్లాగే ద్వితీయ బహుమతి సాధించిన వారిలో: కార్రేమ్స్ జూనియర్ లో జస్వంత్ జాయ్, శివ గణేశ్ లు, కార్రేమ్స్ సీనియర్ లో వరుణ్, ధనేశ్ లు, ఖోఖో జూనియర్ లో చంద్ర మోహన్ టీమ్, కబడ్డీ లో భరత్ టీమ్, ఆడపిల్లల టీమ్ కబడ్డీ లో మల్లికా టీమ్, బ్యాడ్మింటన్ లో చరణ్, వెంకట్ రెడ్డి లందరూ కూడా రెండవ స్థానం కైవసం చేసుకున్నారనీ, తృతీయ స్థానం లాంగ్ జంప్ లో చరణ్, డిస్క్ త్రో లో భరత్ లు కైవసం చేసుకున్న వారిలో ఉన్నారని పాఠశాల పీ.టీ మాస్టర్ కుమార్ తెలియ పరచినాడు, ఇట్టి సందర్భముగా కార్యక్రమంలో గుట్టమీది నరేందర్, ముత్తంగి లక్ష్మయ్య, మాల్యాద్రి నాయుడు, అందె లక్ష్మణ్ రావు, ఏర్పుల శ్రీకాంత్, సంఘం శ్రీకాంత్, బుద్దోల్ బాబు, రాఘవేందర్, యాలల కిరణ్, ఆరిఫ్, సుమ నళిని, అన్షు, బిందు, రేఖ, మహేందర్, శ్రీనివాస్ చారి, రాజేందర్, తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking