ఊరి సమస్యలపై నేనున్నానంటూ ముందుకు వస్తున్న యువ నాయకుడు.

మద్దుల ప్రశాంత్..

వీణవంక ప్రజాబలం ప్రతినిధి జూలై 26

వీణవంక మండలంలోని లక్ష్మక్కపల్లి , నర్సింగాపూర్ ప్రధాన రహదారిపై గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తుమ్మ చెట్లు విరిగి రోడ్డుపై పడిపోగ, అదే గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ తన సొంత ఖర్చులతో జెసిబి సహాయంతో చెట్లను తొలగించి, శుభ్రం చేశాడు. రోడ్ల పైన పలు చెట్లు విరిగిపోయి ప్రధాన రహదారి పైనే పడిపోవడంతో వాటిని తీసేవారు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గ్రామంలో పరిపాలన కొనసాగిస్తున్న పాలకులు సరైన దృష్టి సారించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే మాదిరిగా ఈదురుగాలులకు విరిగిన చెట్లు ఎక్కడపడితే అక్కడే ఉండిపోయాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయవలసిన నాయకులు పట్టించుకోవడం లేదు.యువ నాయకుడు ముందుకు వచ్చి తన సొంత ఖర్చుతో, శుభ్రం చేయించాడు, అదేవిధంగా సొంత గ్రామంలో చనిపోయిన కుటుంబాలకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నాడు. ఇలాంటి నాయకుడు మన మండలానికి ఉన్నాడంటే ఒక గొప్ప వరమని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking