ఉత్సాహంగా ట్విన్నింగ్ డ్రస్ పోటీలు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 26:
తార్నాక నారాయణ పాఠశాలలో చాలా ఉత్సాహంగా పేరెంట్ చైల్డ్ ట్విన్నింగ్ డ్రస్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు ఒకే రంగు దుస్తులు
ధరించి వారి పిల్లలతో సమానంగా ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు వారు చిన్నప్పుడు ఆడిన ఆటలను గుర్తుకు తెచ్చుకొని ఎంతో సంతోషపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ
ఇలాంటి ఆటల వల్ల మా పిల్లలకు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మాకున్న ఈ బిజీ జీవితంలో ఇలా మా పిల్లలతో
గడిపే అవకాశమిచ్చిన పాఠశాల ప్రిన్సిపాల్ పర్విన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల జిఎం గోపాల్ రెడ్డి, ఏజిఎం బాలపరమేశ్వర్ లు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ- కిడ్జ్ కో- ఆర్డినేటర్- నూర్, ఈ-కిడ్జ్, వి.పి. షాహీన్, ఏ. ఓ. మహేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking