తూప్రాన్, జనవరి 4 (ప్రజా బలం న్యూస్) :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లికి చెందిన తంగెళ్ళ లక్ష్మణ్ 18 సంవత్సారాల యువకుడు చెరువు పడి గల్లంతు అయిన సంఘటన గురువారం రోజున చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు బృందం ఘటన స్థలికి చేరుకుని వలలతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన ఐతే యువకుని బట్టలు మెట్లపై ఉండడం అతనితో వేరొక యువకులు రావడం పలు అనుమానాలకు తావిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నరు. అయితే ఎల్లుండి గల్లంతైన యువకుడి అక్కయ్య పెండ్లి ఉండడంతో ఎవరో కావాలని మా బాబుని నుకేసారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలిలో కుటుంబీకుల బంధువుల రోదనలు చూపరులను మనస్సులను కలచి వేస్తున్నాయి.