ఖమ్మం ప్రతినిధి జనవరి 4 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గోకినపల్లి గ్రామానికి చెందిన ఉద్యమకారుడు దరిపల్లి వీరబాబు దరఖాస్తు చేసుకున్నాడు ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం పోరాడినన ఉద్యమకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పథకాలని లబ్ధి చేకూర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, సర్పంచ్ గుగులోత్ క్రాంతి ఎంపీటీసీ పెద్ద పొంగు రాంబాబు ఉప సర్పంచ్ పయ్యవుల రామనాధం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మీగడ శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు బుగ్గవీటి రవికాంత్ సారంగి నాగేశ్వర రావు, బాబుసాని గ్రామ కార్యదర్శి, ఇతర అధికారులు నాయకులు పాల్గున్నారు