తూప్రాన్ మున్సిపల్ ఆఫీసు వెనుక ఉన్న కాలనీ దుస్థితి
ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని కాలనీవాసుల వేదన.
మెదక్ తూప్రాన్ అక్టోబర్ 12 ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ లో మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న 12వ వార్డు పరిధిలోకి వచ్చే ఏబీ కాలనీ పూర్తిగా మురికి కూపంగా తయారయింది.మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ లో అభివృద్ధి బాగా జరిగిందని చెప్పుకుంటున్న మున్సిపల్ పాలకులు, అధికారులు కార్యాలయం వెనుక భాగంలో ఉన్న కాలనీ దుస్తితి గురించి గానీ అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్న వారి సమస్యలు గానీ ఏ మాత్రం పట్టించుకో లేకపోతున్నారు.
కాలనీలోని మురికి నీళ్ల తో మునిగిపోయి ఉన్నాయి. రోజుల తరబడి మురికినీరు నిలిచిపోయి దోమలు, క్రిమి కీటకాల బెడద ఏర్పడి కాలనీ ప్రజలు అనారోగ్యం పాలావుతున్నారు.
మున్సిపల్ అభివృద్ధి కి కోట్లు నిధులు వచ్చాయని గొప్పలు చెప్పుకోవ దమే కానీ ఇక్కడ అభివృద్ధి ఏది?
అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 12వ వార్డుకి ఇంతవరకు డ్రైనేజీ, సీసీ రోడ్లకు ఒక్కరూపాయి ఖర్చుపెట్టింది లేదు.
ఎన్ని నిధులు ఉన్న అంత శూన్యమని
నిధులన్నీ కొన్ని వార్డులకే పరిమితమయ్యా యనే తూప్రాన్
ప్రజలు విమర్శిస్తున్నారు. మెయిన్ రోడ్డు పై కలర్ ఫుల్ లైట్లు వేసి,రోడ్డుకు ఆనుకొని ఉన్న రోడ్లపై సీ సీ రోడ్లు వేసినంత మాత్రాన అంతా అభివృద్ధి జరిగినట్లేనా అని ప్రజలు అంటున్నారు. మున్సిపల్ వెనుకాల ఉన్న కాలనీ అభివృద్ధికి మాత్రం నిధులు ఖర్చు పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు.
మా వీధిని పచ్చని చెట్లతో చాలా సుందరంగా ఉంచుకునే వాళ్ళము. కానీ,ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైందని,
మా వీధి గుండా నడవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్లు మురుగునీరు తో కాలనీ మొత్తం అధ్వానంగా మారిందని, మురికి కాలువల నిర్మాణాలు లేకపోవడం వలన ఆ మురుగునీరు మొత్తం మా కాలనీ గుండా ప్రవహించి, వందరగా అసౌకర్యం ఏర్పడిందని వాపోతున్నారు.
ఒకప్పడు సుందరమైన కాలనీ, వీధులు. ఇప్పుడు చిందర వందరగా మారడంతో ఈ వీధిలో ఎందుకు ఉంటున్నామా? అని బాధపడే పరిస్థితి వచ్చిందంటున్నారు.
మా కాలనీ వాసుల బాధను అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని చెప్పారు.
వీధి మొత్తం మురుగునీరు ఉండడంతో దుర్వాసనతో భరించలేని విధంగా మారింది. పిల్లలు బడుల నుండి ఇంటికి వస్తున్న సమయంలో ఆ మురికి నీళ్లల్లో నుంచి నడుచుకుంటూ రావడంతో కాళ్లు చెడిపోయి,చర్మ వ్యాధులు వస్తున్నాయని కాలనీ ప్రజలు తెలిపారు.
ఇప్పటికైనా కాలానీని మెరుగు పరిచే చర్యలు చేపట్టి, కాలనీ వాసుల ఆరోగ్యాలను కాపాడవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
