ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 12 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో గురువారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల తెలుగు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళ అధ్యాపకులు బతుకమ్మను పలు రకాల రంగు రంగుల పువ్వులతో పేర్చి సంప్రదాయ నృత్యాలతో హోరేత్తించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ… కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.దీనిలో భాగంగానే ఆడపడుచుల అతి పెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ ముందస్తు వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బతుకమ్మ అంటే ప్రకృతిని ఆరాధించి, ప్రేమించే పండుగ అని వివరించారు.ప్రకృతిని రక్షించడం ద్వారానే మానవ మనుగడ సాధ్యమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.