ప్రజాబలం మూసాపేట్ :
ఈరోజు మూసాపేట్ పంచశీల స్కూల్ లో డాక్టర్ శ్రీ ఏపీజే ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా అబ్దుల్ కలాం గారి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా…
సైన్స్ యాత్ర ఆర్గనైజేషన్ వారు ఈ సందర్భంగా పిల్లల్లో ప్లాస్టిక్ నివారణ వాటి ఆవశ్యకత అనే అంశం లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పేపర్ పెన్స్ & ప్రిన్సిపల్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ట్రస్మా స్టేట్ ప్రెసిడెంట్, చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వ్యవస్థాపకులు శ్రీ శివరాత్రి యాదగిరి , ట్రస్మా కూకట్పల్లి మండల ప్రెసిడెంట్, నాగార్జున విద్యాలయ వ్యవస్థాపకులు శ్రీ కమలాకర్ రావు , పంచశీల స్కూల్స్ వ్యవస్థాపకులు & ట్రస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ , కాంగ్రెస్ మహిళా విభాగం మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి & విజ్ఞాన్ గ్రామర్ హై స్కూల్స్ వ్యవస్థాపకులు చింతల నిర్మలారెడ్డి, మరియు సైన్స్ యాత్ర ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సుబ్బారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.