ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 27 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణ కేంద్రం ఐబీ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి,బీజేపీ నాయకులు చెస్తున్న వ్యాఖ్యల ని కాంగ్రెస్ నాయకులు ఖండించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తెల్లారే రైతుల పక్షాన తరుగు మీద పోరాటం చేశారని అన్నారు. గతం లో ఒక్క బ్యాగ్ కి 4-5 కిలోల తరుగు తీస్తున్నారని,మనం గెలిచాక అల ఉండొద్దు అని రైతులకి ధాన్యం తుకం లో ఒక్క కిల కూడా కోత ఉండొద్దు అని సరి కి సరి ధాన్యం జోకి రైతులకి న్యాయం చేసిన వారు ప్రేమ్ సాగర్ రావు గారనీ అన్నారు. నిండు అసెంబ్లీ లో మా ప్రాంత నీటి వాట మాకు ఇవ్వాల్సిందే అని గొంతు ఎత్తారని గుర్తు చేశారు.
గతం లో దండేపల్లి మండల గూడెం ఎన్నో సార్లు పైపులు పగిలిన సంఘటనలు చూసాము వాటిని మరమ్మతులు చేపించి,అన్ని మండలాల కి ఎండాకాలం లో కూడా పూర్తి స్థాయి లో నీరు అందిచ్చారు. మొన్నటికి మొన్న కడెం ప్రాజెక్ట్ కి మరమ్మత్తులు చేయించి మన నియోజక వర్గానికి నీరు అందించడం జరిగింది.ఇది మా నాయకునికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ది.
అలాగే ఎమ్మెల్యే గా గెలిచాక ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల మీద,స్కూల్స్ సరిగా లేవు అని గతం లో ప్రభుత్వ పాఠశాలల నీ విస్మరించారని మా నాయకుడు పిఎస్ఆర్ గెలిచిన వెంటనే రివ్యూ మీటింగ్ తీసుకుని కావలసిన నిధులను ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మన లక్షెట్టిపెట ప్రభుత్వ జూనియర్ కళాశాల కలిపితే గత ఎమ్మెల్యే ఏమీ పట్టించుకో లేదు.కానీ మన పి ఎస్ ఆర్ దాదాపు అరు కోట్లు నిధులతో కట్టించడం జరుగుతుంది.
అలాగే మండలంలో డి ఎమ్ ఎఫ్ టి నిధులతో రోడ్లు నిర్మాణం అనేక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు.
సమ్మక్క సారక్క జాతర కి కూడా ఇన్చార్జి మంత్రి సీతక్క దగ్గర నుండి నిధులు తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే ది,పి ఎస్ ఆర్ అంటే విజన్ ఉన్న నాయకుడు మాత శిశు ఆసుపత్రి నీ మంచిర్యాల ఐబి లోకి మార్చాలని ప్రతిపాదించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మన నియోజక వర్గం లో ఎన్నడూ లేని విధంగా ఆపదలో ఉన్న వారికి ఎల్ ఓ సీలు,సీ ఎమ్ ఆర్ ఎఫ్ నిధులు శాంక్షన్ చేయడంలో ఎక్కువ మంది కి ఇప్పించిన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అని చెప్పారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి రావు ప్రజలలో ఉండకుండా, ఎమ్మెల్యే గారి మీద నోటికి ఎది వస్తె అది మాట్లాడి ప్రజలని తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు.రఘునాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక పోయి అమెరికా లో మొహం దాచుకున్నాడు అని, ఓడిపోయిన వెంటనే గతం లో ప్రేమ్ సాగర్ కి పోటీగా నిర్వహించిన బీజేపీ అంబలి కేంద్రాలను ఎత్తి వేశారని. రఘునాథ్ కి ప్రజల మీద చిత్త శుద్ది లేదు అని అయన ఒక ఎలక్షన్ స్టంట్ మాస్టర్ అని సంక్రాంతి పండక్కి వచ్చే గంగిరేద్దు లాంటి వాడు అని,ఎన్ ఎచ్ 63 మీద ఒకసారి హై వే ప్రజల తరుపున, మరోసారి ఎల్లంపల్లి రైతుల తరుపున మాట్లాడి కేంద్ర నాయకులని కలుస్తూ ఆయనే ప్రజల్ని, అధికారులని,నాయకులని తప్పు దోవ పట్టిస్తు ఎన్ ఎచ్,63 బాధితులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మీద ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడే స్థాయి ఒక చదువుకున్న వ్యక్తి గా మిది కాదని ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు.మరొక సారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజా కోర్టు లో తేల్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎం డి అరిఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్,మండల అధ్యక్షులు పింగిలి రమేష్,బ్లాక్ కాంగ్రెస్ నలిమెల రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకతి శ్రీను,రాందేని వెంకటేష్,ఎంపీపీ అన్నం మంగ చిన్నన్న,జిల్లా అధికార ప్రతినిధి బియ్యల తిరుపతి,కో ఆప్షన్ షాహిద్ అలి,ఎస్ సి సెల్ అద్యక్షుడు రాజేష్,గుండా శ్రీనివాస్,నడిమెట్ల రాజన్న,గుత్తికొండ శ్రీదర్,స్వామి,ఆయిల్ల విజయ్,రాజు,చారి , హాజీ,అమీర్,కోల నాగి,నమెట్ల తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prev Post