ఏసీబీ వలలో అవినీతి చేప

లక్షెట్టిపేట మున్సిపల్ ఆఫీస్ లో ఘటన
ఇంటి పర్మిషన్ కు రూ. లక్ష డిమాండ్

పదిహేను వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 17: మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ఇంటి పర్మిషన్ కోసం మున్సిపల్ మేనేజర్ శ్రీహరి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ లు పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ… ఇటిక్యాలకు చెందిన ఆకుల శ్రీనివాస్ తన సొంత భూమిలో రేకుల షెడ్డువేసుకోవడానికి అనుమతి కోసం మున్సిపల్ మేనేజర్ ను సంప్రదించాడన్నారు. అనుమతి మంజూరు చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా బాధితుడు బతిమలుకోగా పదిహేను వేలకు బేరం కుదిరిందన్నారు. దీంతో బాధితుడు ఏసీబీని అశ్రాయించారన్నారు.మున్సిపల్ మేనేజర్ శ్రీహరి సూచనతో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ లంచం డబ్బులు తీసుకుంటుండగా తమ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నామన్నారు.వారిని అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెడతామన్నారు. ఈ దాడిలో సీఐలు,సిబ్బంది పాల్గొన్నారు.లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించండి, ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి,వివిధ పనుల రీత్యా ప్రభుత్వ ఆఫిస్ లకు వెళ్లేవారు తమ పని కోసం ఎవరినైనా అధికారులు డబ్బులు అడిగితే తమను సంప్రదించలన్నారు.అధికారులు ప్రజలకు పనిచేయడానికే ఉన్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking