పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి ఖమ్మం నగరంలోని నయాబజార్ ఉన్నత పాఠశాల, ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ లోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, తల్లంపాడు లోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, పాలేరు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో టాయిలెట్స్ రన్నింగ్ వాటర్ తో, ర్యాoప్, విద్యుత్ సదుపాయం లైట్లు, ఫ్యాన్స్ తదితర అన్ని వసతులు ఉండాలన్నారు. కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాల పాఠశాలలకు వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు. పాఠశాల ఉన్నట్లు, పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఉన్నట్లు, పోలింగ్ తేదీతో సహా ఓటర్లకు అవగాహన కలిగేలా ఏర్పాటు చేయాలన్నారు. పెయింటింగ్, మైనర్ పనులు పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్ర లే అవుట్ ను బట్టి, ఓటింగ్ కంపార్టుమెంట్, సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఓటింగ్ కంపార్టుమెంట్ వద్ద గల కిటికీలు మూసివేయించాలని ఆయన తెలిపారు. పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, విద్యాశాఖ ఇఇ నాగశేషు, అధికారులు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking