జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జులై 05 : 2024 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ సంక్షేమశాఖ ద్వారా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అర్హత గల మైనార్టీ అభ్యర్థుల (ముస్లిం, క్రైస్తవులు,సిక్కులు, జైనులు,బౌద్ధులు, పార్శీలు)నుండి ముఖ్యమంత్రి విదేశీ విద్య పథకం కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. 2024 సంవత్సరం స్ప్రింగ్ ప్రవేశాలకు విదేశీ విద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్/డాక్టోరల్ కోర్సులు చదువుకునేందుకు ఉపకార వేతనాలు/ఆర్థిక చేయూత మంజూరు కొరకు అన్ని అర్హత ప్రమాణాలు పూర్తి చేసి జనవరి 1,2024 నుండి జూలై 31,2024 కాలంలో అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 8వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గం॥లలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.