ధాన్యం చాటున దగా…
– అధికారులు లోతుగా దర్యాప్తు చేసేనా?
– కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఒకరిపైనే చర్యల ?
– 200 కోట్ల కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అయిన వారిపై చర్యలు ఉంటాయా ఉండవా ?
– హుజరాబాద్ నియోజకవర్గం లో డి ఫ్లాట్ లో ఉన్న మిల్లర్లకి ధాన్యాన్ని ఎలా ఇచ్చారు?
–
హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూలై 5
వారు దొంగలు కారు దొరల్లాగా బ్రతుకుతున్నారు కానీ అసలైన దొంగలు వీరే, కష్టపడరు శ్రమించరు నెమటోడ్చరు మోసం చేయడంలో నిపుణులు, బయటికి మాత్రం పెద్ద పెద్ద రైస్ మిల్లులు కనిపిస్తాయి లోపల మాత్రం అంత దొంగ వ్యాపారాలే, వీరు దొరల్లాగా బ్రతుకుతారు కానీ అసలైన దొంగలు వీరే, సంబంధిత అధికారులు కూడా వీరితో చేతులు కలిపి అందిన కాడికి దండుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు కాబట్టి అయ్యా సీఎం గారు సీఎంఆర్ ఈ దందాపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మోసం చేసిన వారి ఆస్తులను రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ వ్యాపారానికి హుజరాబాద్ కేంద్రంగా తయారైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి, దీనికి తోడు రాజకీయ నాయకులు హస్తం కూడా ఉందని సమాచారం. ఆదాయ పన్ను శాఖ అధికారులు సంబంధిత ప్రభుత్వాధికారులపై బటి దాడులు చేస్తే నమ్మలేని నిజాలు ఎన్నో బయటపడతాయని పలువురు చర్చించుకుంటున్నారు. దీనితోపాటు జిల్లా పాలన అధికారి ఈ కుంభకోణంపై దృష్టి సారిస్తే బాగుంటుందని,
ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ధాన్యాన్ని పొంది దాన్ని విక్రయించి కొందరు రైస్ మిల్లర్లు కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హుజురాబాద్ కేంద్రంగా ఈ దందాకు పాల్పడిన ఓ వ్యాపారి వ్యవహారం స్థానికంగా సర్వతా చర్చనీయాంశం అవుతోంది. ఆ వ్యాపారికి సివిల్ సప్లై లో సమీప బంధువు ద్వారానే ఇవన్నీ ఇంత పెద్ద కుంభకోణం చేయగలిగాడా? ఒక ఏజెన్సీ అనతి కాలంలోనే కోట్ల రూపాయలకు ఎదిగిన వ్యాపారి ప్రభుత్వ ధాన్యాన్ని పెద్ద ఎత్తున పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది?. దీని విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం నామమాత్రంగా చిన్న వ్యాపారిగా వ్యాపారాన్ని ప్రారంభించిన ఇతను అనతి కాలంలోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది. ప్రభుత్వ నుండి బినామీ పేర్లతో ధాన్యాన్ని పొందడం దాన్ని అమ్ముకోవడం ద్వారా సదరు వ్యాపారి కోట్ల రూపాయలు అర్జించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుండి ధాన్యాన్ని పొందిన వ్యాపారి దాన్ని బియ్యంగా పట్టించి ఎఫ్ సి ఐకీ ప్రభుత్వానికి లెవీగా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ ధాన్యాన్ని బియ్యంగా పట్టించి ప్రభుత్వానికి పెట్టకుండా కోట్లు కూడా పెట్టుకున్నట్లు సమాచారం..
జిల్లాలో పెద్దపెద్ద మిల్లర్ల కంటే ఘనుడు..!
అధికారులకు ప్రలోభాలకు గురిచేసి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారా? అనే ప్రశ్న పునరావృతం కాక మానదు. పక్కదారి పట్టించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం, హుజరాబాద్ చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ధాన్యం విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా, తద్వారా తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయలు ఆర్జించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాపారి ఎక్లాస్ పూర్, చింతలపల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సూరారం వద్ద ఒక గోదామును, హైదరాబాదులో పాల స్టోరేజీ ప్లాంట్ ను, స్థానికంగా రెండు రైస్ మిల్లులను, చొప్పదండిలో ఒక రైస్ మిల్లును కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది? హైదరాబాదులో అపార్ట్మెంట్లు, రెండు ఫార్చునర్ కార్లు కొనుగోలు చేసినట్లు సమాచారం? చొప్పదండితో, తాడికల్ లోని మిల్లుల్లో తన ఏజెన్సీకి వచ్చిన ధాన్యాన్ని ఇచ్చిన విలువ చేసి, తదనంతరం విక్రయించినట్లు సమాచారం. ఇందులో ఎక్కువ శాతం ఆస్తులు బినామీ పేర్లపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇతనికి గతంలో కొంతమంది ప్రజాప్రతినిధులు సివిల్ సప్లై జిల్లా ఆఫీసులో సమీప బంధువు కూడా సహకరించినట్టు తెలుస్తోంది.
ఇటీవల ప్రభుత్వ ధాన్యాన్ని తీసుకొని లెవీ పెట్టని వ్యాపారులపై సివిల్ సప్లై, విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసింది. జిల్లాకు చెందిన మారుతి అనే వ్యాపారిపై ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదయింది. అయితే మారుతి కంటే ఎక్కువగా ధాన్యాన్ని హుజురాబాద్ వ్యాపారి విక్రయించినట్టుగా తెలుస్తోంది. అయితే హుజురాబాద్ వ్యాపారి ఎంత ధాన్యం తీసుకున్నారు.? ఏ ఏ ఏజెన్సీల పేరు మీద తీసుకున్నాడు.? ప్రభుత్వానికి ఇప్పటివరకు పెట్టింది ఎంత.? ప్రభుత్వం నుండి తీసుకున్నది ఎంత.? గత నాలుగైడు ఏళ్లలో ప్రభుత్వానికి ఎంత బియ్యం బాకీ ఉన్నాడు.? అన్న విషయాలు అధికారులు బయటికి తీయాల్సి ఉంది. కాగా హుజరాబాద్ కేంద్రంగా మరికొందరు వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ధాన్యం విక్రయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ లో జరిగిన అక్రమ వ్యాపారంపై అధికారులు ఒక నివేదికను విడుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇతనికి ప్రభుత్వం నుండి వచ్చిన ధాన్యాన్ని రికవరీ చేస్తారా లేదా అన్నది లక్ష డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రభుత్వ ధాన్యాన్ని పెద్ద ఎత్తువ కొల్లగొట్టి కోట్ల రూపాయలు వెనుకేసుకున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.