డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు “కరెంట్” దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో..!

 

ఎమ్మేల్యే సంజయ్ చొరవ చూపుతారా.

పేదల పక్షాన జీ”వన్”గా నిలబడతారా..

ఆందోళనల్లో డబుల్ ఎంపిక లబ్ధిదారులు

జగిత్యాల ప్రతినిధి, జనవరి 19: (ప్రజా బలం)గత బీఆర్ ఎస్ ప్రభుత్వం జగిత్యాలలోని నూకపల్లిలో నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇటీవల ఎన్నికలకు ముందు లబ్ధిదారులను ఎంపిక చేయగా కొందరు కరెంట్ మీటర్లకు దరఖాస్తు చేసుకోగా ఎన్నికల నేపథ్యంలో అప్పుడు ఆపిన దరఖాస్తుల స్వీకరణ మల్లీ ఎప్పుడు మొదలు పెడతారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్న వైనమిది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాలలో నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మానానికి శ్రీకారం చుట్టింది. ఈ ఇండ్ల నిర్మాణంలో జాప్యం చోటు చేసుకున్నా ఎట్టకేలకు మూడు వేలకు పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకను వీటికి కొన్ని మౌలిక వసతుల కల్పన కరువైనా ఎన్నికల లబ్ది కోసమో ఏమోగానీ ఎన్నికలకు ముందు మూడు వేల నాలుగు వందల డబుల్ ఇండ్లకు లబ్ధి దారులను గత ప్రభుత్వం ఎంపిక చేసి వీరందరికి ప్రొసీడింగ్స్ అందజేసింది. ఇదే తరుణంలో కొందరు లబ్ధిదారులు తమకు చెందిన డబుల్ ఇండ్లకు కరెంట్ సౌకర్యం కోసం విద్యుత్ కార్యాలయంలో డీడీలు కట్టిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కరెంట్ సరఫరా దరఖాస్తులు తీసుకోవడం ఆపివేయాలని విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎన్నికలు ముగిసి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో డబుల్ ఇండ్ల లబ్ది దారులు సంతోషంలో మునిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని ఏ ప్రభుత్వం ఇండ్లు కట్టించినా అందులో ఉండే పేదల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందనే ఆశాభావంలో నిరుపేద కుటుంభాలున్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం వడపోతాల విధానంను అనుసరించి వాస్తవ నిరుపేదలను డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులకు అందులో ఉండేది నిరుపేద కుటుంబాలే అని తెలిసినా ఇంకా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ది దారుల కుటుంబాలు కరెంట్ మీటర్ల కోసం దరఖాస్తులు స్వీకరణ కోసం జిల్లా అధికారులకు ఎందుకు అదేశాలివ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పక్కన పెడుతుందా అన్న ఆందోళనల్లో స్థానిక లబ్ది దారులు చేరారు. ప్రస్తుత బీఆర్ ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చొరవ తీసుకొని గత కొన్నేళ్లుగా పేదల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారథ్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు కరెంట్ మీటర్ల ఏర్పాటు కృషిచేస్తే దాదాపు పదిహేను వేల మందికి మేలు చేసిన వారవుతారని డబుల్ ఇండ్లలో ఎంపికైన లబ్ధిదారులు ఆశిస్తున్నారు. వేచిచూద్దాం రాజకీయాలా.. పేదల సంక్షేమమా అంటూ విద్యావంతులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking