జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని రకాల చర్యలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 19:
శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులతో కలిసి ఆయా ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఈఆర్వోలతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసి సిద్దంగా ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనలు, సలహాల ప్రకారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటి నుంచే అధికారులకు అవసరమైన సూచనలు చేశామని వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ఫారం–6,7,8 లను ఈనెల 22వ తేదీ వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని పార్లమెంట్ కి సంబందించి ఏడు నియోజకవర్గాలకు కలుపుకొని పూర్తి స్థాయిలో అందచేసేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని అధికారుల ద్వారా అందచేయడం జరుగుతుందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 20, 21వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని… అందులో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకొని అధికారుల సమన్వయంతో పూర్తి చేస్తామని కలెక్టర్ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఈఆర్వోలు, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking