బాల రాముడి విగ్రహ పునర్ ప్రతిష్టని రాజకీయం చేయొద్దు. ఎంపి. బండి సంజయ్

 

హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం జనవరి 19

ఈ నెల 22న అయోధ్యలో బాల రాముడి పున ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకేయం చేయాలని చూడడం సరైన విధానం కాదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి రామాలయాన్ని దర్శించుకోని ఆలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఈ నెల 22న ప్రపంచ వ్యప్తంగా బాలరాముడి పునర్ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకునేందుకు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరని అన్నారు. ప్రభుత్వం కూడా ఆ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 22న అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు చూస్తుందని. ఇది సరైన విధానం కాదని గుర్తు చేశారు. దేవుడి అక్షింతలను తమకు రేషన్ బియ్యంతో పోలుస్తున్నారని. కొంగ్రెస్ నాయకులు కావాలనుకుంటే సాంబమాశుర బియ్యమే సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నేను అయోధ్యలో పూజ చేసిన సన్న బియ్యాన్ని తీసుకచ్చి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చురకలు అంటించారు. భక్తతో చెపట్టే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరు భక్తిభావంతో పాల్గొని హిందుత్వాన్ని చాటి చెప్పాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు తిరుపతిరెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, సంపెల్లి సంపత్ రావు, కృష్ణారెడ్డి, పుల్లూరి ఈశ్వర్, దొగ్గల రవి, ఆకుల రాజేందర్ తదితరుల పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking