ప్రెస్ క్ల‌బ్ క‌మిటీ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ -ఈసీ మీటింగ్‌లో ప‌లు తీర్మానాల‌కు ఆమోదం

 

ప్రజాబలం ప్రతినిధి హన్మకొండ జిల్లా ఫిబ్రవరి17:గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ నూత‌న క‌మిటీ శుక్ర‌వారం ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టింది. ప్రెస్ క్ల‌బ్ లో ఉద‌యం ముందుగా వేద‌పడింతుల ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మం,ఆశీర్వచ‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. అనంత‌రం ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడు వేముల నాగ‌రాజు, కార్య‌ద‌ర్శి బొల్లార‌పు స‌దయ్య‌, కోశాధికారి బొళ్ల అమ‌ర్ ఆధ్వ‌ర్యంలోఈసీ మీటింగ్ జ‌రిగింది. కార్య‌ద‌ర్శి ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు తీర్మానాల‌కు స‌భ్యులంతా ఆమోదం తెలిపారు. వ‌రంగ‌ల్ లో ప్రెస్ క్ల‌బ్ ఏర్పాటుకు స‌భ్యులంతా ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు.అలాగే, కాజీపేట‌, హ‌స‌న్‌ప‌ర్తి మీడియా పాయింట్ ల‌కు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌కోసం నెల‌వారీగా ప‌ది వేల రూపాయల‌ను ప్రెస్ క్ల‌బ్ చెల్లించాల‌ని నిర్ణ‌యించారు. ప్రెస్ క్ల‌బ్ లో జ‌రిగే ప్రెస్ మీటింగ్‌ల విష‌యంలో , ప్రెస్ క్ల‌బ్ హాల్ నిర్వ‌హ‌ణ, పార‌ద‌ర్శ‌కంగా ఆదాయ,వ్య‌యాల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.ఎన్నికైన కమిటీపైన,గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పైన నిరాధార ఆరోపణలు,సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత దూషణలు, నిందారోపణలు చేయకూడదని సూచించింది. ఎవరైనా అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కమిటీ హెచ్చరించింది.నూత‌న క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా స్వీటు బాక్స్‌ల పంపిణీ, కంటి వెలుగు కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంపై అభినంద‌న తీర్మానం చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్ ప్రెసిడెంట్లు గోకార‌పు శ్యామ్‌,బొడిగె శ్రీను, దుర్గాప్ర‌సాద్‌,అల్లం రాజేశ్ వ‌ర్మ‌, యాంసాని శ్రీనివాస్‌,జాయింట్ సెక్ర‌ట‌రీలు సంపెట సుధాక‌ర్‌,వలిశెట్టి సుధాక‌ర్‌,బూర్ల న‌రేంద‌ర్‌,విష్ణువ‌ర్ద‌న్‌, ఈసీలు హ‌రీశ్‌,శ్రీకాంత్‌,అంజ‌నేయులు, న‌యూంపాష‌,వేణుగోపాల్‌, దిలిప్‌,సంజీవ్‌,భ‌ర‌త్‌,మంచాల రాజు,విజ‌య్‌రాజ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking