ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో పాల్గొన్న జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్
పెద్ద పెళ్లి ఫిబ్రవరి 17( ప్రజాబలం)
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు పట్టణాలలో మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించారు. జూలపల్లి మండల కేంద్రంలో జరిగిన బి ఆర్ ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జన్మదిన వేడుకలలో స్థానిక జెడ్పిటిసి కెసిఆర్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్దుల లక్ష్మణ్ తో పాటు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రమాదేవి రాంగోపాల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చాతర్ల కాంతయ్య లు పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలను కొనియాడారు. పెద్దపల్లి మానసిక వికలాంగుల కేంద్రంలో సేవాదళ్ ఆధ్వర్యంలో పండ్లు బెడ్ పంపిణీ చేశారు. అలాగే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆహార పదార్థాలు అందజేసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు సందర్భంగా అభినందనలు తెలిపారు.
సుల్తానాబాద్ మండలంలో పర్యావరణ రహిత బట్ట సంచులను ప్రజలకు కేసీఆర్ సేవాదళ్ సభ్యులు అందజేశారు. జూలపల్లి మండలం వాడు కపూర్ గ్రామంలో మండల పార్టీ యువత అధ్యక్షుడు జెట్టి సతీష్ ఆధ్వర్యంలో గ్రామ పార్టీ శ్రేణులను కలుపుకొని జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి ప్రభుత్వం గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేశారు. ఎలిగేడు, ఓదెల, శ్రీరాంపూర్ మండలాలలో కేసీఆర్ సేవాదళం తరపున వివిధ కార్యక్రమాలు నిర్వహించి భవిష్యత్తు భారత దేశ దార్శనికుడు కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. కెసిఆర్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జన్మదిన పురస్కరించుకొని భవిష్యత్తులో పెద్దపల్లి నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కెసిఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశం పటేల్ తో పాటు బొద్దుల సాయినాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో బింగి రాజు, శ్రీనివాస్, యాదగిరి, సంపత్, రాజయ్య, లక్ష్మణ్, మహేందర్ పాల్గొన్నారు
