అంగరంగ వైభవంగా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవం

రామలింగేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​

స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్​ దంపతులు

Keesara Gutta Ramalingeswara Swamy Kalyanotsavam in full splendor

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 17:మహాశివరాత్రి సందర్బంగా మేడ్చల్​– మల్కాజిగిరి జిల్లా కీసర గుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవంతో అంకురార్పణ జరిగింది. శుక్రవారం రాత్రి కీసర రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​లు ముందుగా రామలింగేశ్వరుడికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి దంపతులతో పాటు జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ దంపతులు రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో కూర్చొని వేదమంత్రోచ్చారణల మధ్య ఎంతో వైభవోపేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking