తెలంగాణ ఒక చైతన్యం తొణికిసలాడే గడ్డ అని, ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యలే ఇతివృత్తంగా, పనిచేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు అని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేస్తు చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ తెలంగాణ ఆదరించదని, దేశంలో జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని తెలంగాణతో బీఆర్‌ఎస్ పార్టీది పేగుబంధం అని పేర్కొంటు పురిటిగడ్డపైన గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం అని తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డంకులు సృష్టించే శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలనీ, వేల దాడులు లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనదనీ, నాడు భయపడితే తెలంగాణ వచ్చేదానీ, సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో కార్యకర్తలే బలం బలగం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
అన్నం తినో అటుకులు తినో ఉపాసం ఉండో పద్నాలుగేండ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కున్నామని, అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని, లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత, కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుందని, ప్రజల ఆశీర్వాదం, లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో ఉద్యమవీరులుగా నాడు నవ తెలంగాణ నిర్మాణ యోధులుగా నేడు పట్టుదల, అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించి పెట్టేదే కార్యకర్తలని, 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగి బీఆర్‌ఎస్ పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యం కాని, ఏకపక్ష విజయాలను సాధిస్తూ ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న పార్టీ మనదని, కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి అసాధ్యమనుకున్న పనులు సుసాధ్యం చేసి చూపించి తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికి మాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని, భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత కార్యకర్తల భుజస్కంధాలపైనే ఉన్నదని కేసిఆర్ పేర్కొన్న సందేశాన్ని వినిపించి పార్టీ అధ్యక్షడు కేసిఆర్ ఆదేశానుసారం మంగళ వారం రోజున తెలంగాణ భవన్ లో జరిగిన హైదరబాద్ పార్టీ ఇంచార్జీ దాసోజు శ్రవణ్ ముఖ్య అతిథిగా మరియు ఇంచార్జీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంకు హోం మినష్టర్ మహమూద్ అలీ, హైదరబాద్ జీ హెచ్ ఎం సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, నగర శాసన సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి లు, కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు వందలాది కార్యకర్తలు తమ తమ డివిజన్లలోని సమస్యలను వారి వారి అభిప్రాయాలను వెల్లడిరచి, భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరూ సహపంక్తి భోజనాలు గావించినారు. అందె లక్ష్మణ్ రావు.