ప్రభుత్వ ఉత్తర్వులు 59, 118 పనులు వేగవంతం చేయాలి

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 21:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) 59, 118 మార్చి (ఈనెలాఖరు) వరకు పూర్తి చేయాలని ఈ విషయంలో అధికారులు వేగవంతం చేసేలా సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వులు 59, 118 పై జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, నిబంధనల ప్రకారం ఇప్పటికీ ఇంకా పూర్తి కాని దరఖాస్తులు ఉంటే వాటిని ఈ నెలాఖరు వరకు సంబంధిత అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా 59, ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోకు) సంబంధించి వివరాలను మండలాల సంబంధిత అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకొన్నారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు అధికారులకు అప్డేట్ చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులకు సూచించారు. అలాగే ఇప్పటి వరకు ఎంత వరకు పూర్తి చేశారు ఇంకా ఎన్ని పూర్తి చేయాల్సి ఉందనే వివరాలను తనకు అందించాలని ఏదేమైనా ఈనెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అధికారులు తప్పకుండా పరిశీలించి పూర్తి చేయాలని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 క్రింద అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి క్రమబద్దీకరణ రుసుము విడతల వారిగా వసూలు చేయాలని, మొదటి విడత సేకరణ కు చర్యలు తీసుకోవాలని అన్నారు దీంతో పాటు 118 ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన విధులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 59, 118లకు సంబంధించి అధికారులకు కేటాయించిన పనులను క్షేత్రస్థాయిలో వెళ్ళి పర్యటించాలని పనులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు డిటైల్స్ వివరాలను తనకు తెలియజేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking