ప్రజాబలం: కర్మన్ ఘాట్ కర్మన్హాట్ శ్రీ ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి కబ్జాలో ఉన్న భూమిని సోమవారంరెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అన్యాక్రాంతమైన భూమిని కర్మన్హాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ పాలకమండలి, ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస శర్మకు స్వాధీన పరిచిన భూమి తాలూకు కోర్టు ఉత్తర్వులను అందజేశారు.
శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఈ భూమి విలువ మార్కెట్ లో సుమారు 20 కోట్ల రూపాయలు ఉంటుందని భూమిని స్వాధీనపరిచినందుకు అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్వాధీన పరుచుకున్న భూమిలో ఈ భూమి దేవస్థానం సంబంధించినది అనే బోర్డును పాతించారు. దేవాలయం భూములు ఎవరు కబ్జా చేసినా కోర్టుద్వారా వాటిని తిరిగి పొందినందుకు ఇది ఒక చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్, ఎమ్మార్వో జయశ్రీ, ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ గౌడ్, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, సిఐ జానకి రెడ్డి, ధ్యానాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, ధర్మకర్తలు నర్రి శ్రీనివాస్ కురుమ, మొరిశెట్టి శ్రీనివాస్ , చేగోని మల్లేష్ గౌడ్, జంగారెడ్డి, యాదిరెడ్డి, చాతరి అఖిల, అనిత. మధు సాగర్. తదితర అధికారులు పాల్గొన్నారు .