బిజెపి నాయకుడు బత్తుల శేఖర్ పై అక్రమ కేసు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 20 : దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఎంపిటిసి భర్త బత్తుల శేఖర్ పై అక్రమ కేసు పెట్టారని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి అన్నారు అనంతరం జైల్ ఉన్న శేఖర్ ను బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పరామర్శించడం జరిగింది,ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి మాట్లాడుతూ…
బత్తుల శేఖర్ కేవలం బీజేపీలో చేరడనే కారణంతో ఎమ్మెల్యే దివాకర్ రావు శేఖర్ పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు, ఒక్క మహిళకు న్యాయం చేయాలని శేఖర్ అడగడం తప్ప అని ప్రశ్నించారు.దివాకర్ రావు మీరు పెట్టే కేసులకు బిజెపి నాయకులు బయపడరని బిజెపి నాయకులు ఎప్పుడు ప్రజల తరపున పోరాడుతానని అన్నారు,ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.వివరాలకు వేలుత్తె
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లోని రెబ్బనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అర్చన గ్రామానికి చెందిన బియ్యాల సుజాత అనే మహిళను పాటశాలలో బోధన కోసం వాలంటీర్ గా నియమించుకుని ఒక్క సంవత్సరం పాటు పనిచేయించుకొని ఒప్పందం ప్రకారం వేతనం ఇవ్వకుండ సుజాతను ఇబ్బందులకు గురి చేస్తూ ఉండటంతో గ్రామానికి చెందిన ఎంపీటీసీ భర్త బత్తుల శేఖర్ వెళ్ళి అడగడంతో రెబ్బనపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అర్చన, బత్తుల శేఖర్,బియ్యాల సుజాత ఉద్యోగి తండ్రి పై గత 15 రోజుల క్రితం కేసు పెట్టడంతో అప్పుడే పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది.కానీ స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు మాత్రం శేఖర్ పై కక్ష గట్టి బత్తుల శేఖర్ బిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి చేరిండని కక్షతో ఈ కేసులో ఈ రోజు శేఖర్ ను రిమాండ్ కు పంపించి లక్షెట్టిపేట జైల్ కు పంపించడం జరిగింది తెలిపారు, అదేవిధంగా పాటశాలలో వాలంటర్ పని చేసిన సుజాతకు పాటశాల ప్రధాన ఉపాధ్యాయులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వీరమల్ల హారి గోపాల్, బొప్పు కిషన్,ముత్తే వెంకటేష్,గంగన్న,వేముల మధు, మోటపలుకుల సతీష్,గడిగోపుల సత్తన్న,పాంచాల రమేష్, పసుపునుటి వెంకటేష్,బాణాల రత్నం,ముత్తే అనిల్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking