నాసిరకం సరకులు అమ్ముతున్న “నేషనల్ మర్ట్” పై చర్య తీసుకోవాలి

 

కర్జురలో పురుగులున్న అమ్ముతున్న నేషనల్ మర్ట్

జాయింట్ కలెక్టర్ కు సిపిఎం నేతల పిర్యాదు

*విచారణ చేయిస్తా… అడిషనల్ కలెక్టర్ హామీ

సంగారెడ్డి ఫిబ్రవరి 13 ప్రజ బలం ప్రతినిధి:
సంగారెడ్డి పట్టణంలో నాసిరకం సరకులు అమ్ముతు వినియోగ దారులను మోసం చేస్తున్నరని, కర్జురల్లో పురుగులున్న వాటిని అమ్మి వినియోగ దారులను మోసం చేస్తున్న నేషనల్ మార్ట్ పై చర్య తీసుకోవాలని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు ఏం అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ ఈ రోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారికి పిర్యాదు చేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న నేషనల్ మార్ట్లో ఈ నెల 11నాడు నిత్యావసర సరుకుల కొనుగోలు చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళన తరువాత కర్జురాలు ఓపెన్ చేయగా పురుగులు ఉన్నవి. నాణ్యమైన సరకులుఅమ్ముతున్న మని ప్రచారం చేస్తూ వినియోగ దారులను మోసం చేస్తున్నారు. లాబర్జనే తప్ప వినియోగ దారుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు. షాపుల్లో అమ్ముతున్న సరకుల నాణ్యత పరిశీలించవలసిన ఆహార భద్రత తనిఖీ అధికారులు, మున్సిపాలిటీ హెల్త్ ఇన్స్పెక్టర్ పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వినియోగ దారుల పాలిట శాపంగా మారుతోంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ ద్వారా పిర్యాదు చేసిన పట్టించుకోలేదు. చిన్న పిల్లలు తినే డ్రై ఫ్రూట్స్ ఇంత నాసిరకంగా, పురుగులు పట్టిన వాటిని అమ్మడం ఎంతవరకు సమంజసం. నేషనల్ మార్ట్ లో అమ్ముతున్న అన్ని రకాల సరకులను నాణ్యత పరీక్షలు చేయాలి.యాజమాన్యాల నిర్లక్షం వలన వినియోగ దారులు అనారోగ్యాల పాలవుతున్నారు. నేషనల్ మార్ట్ తో పాటు పట్టణంలోని అనేక షాపుల్లో ఇలాంటి నాసిరకం సరకులు అమ్ముతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
విచారణ చేయిస్తాం… అడిషనల్ కలెక్టర్ హామీ
నేషనల్ మార్ట్ లో నాసిరకం సరకులు అమ్ముతు, కర్జురాల్లో పురుగులు వచ్చిన ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్తో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి హామీ ఇచ్చారు

Leave A Reply

Your email address will not be published.

Breaking