మల్లన్న స్వామి పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలను సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలన ….బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్.

 

సంగారెడ్డి ఫిబ్రవరి 13 ప్రజాబలం ప్రతినిధి గుమ్మడిదల మండలం రామిరెడ్డిబావి గ్రామంలో జరుగుతున్న మల్లన్న జాతరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర నిర్వాహకులు మధు ముదిరాజ్ ని ఘనంగా సత్కరించారు, గ్రామాల్లో మల్లన్న స్వామి జాతర ఆహ్లాదకరంగా జరపటం తో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ ప్రజల విశ్వాసం అని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు జాతరలు ఉత్సవాలు పెట్టింది పేరని అన్నారు. గ్రామ ప్రజలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాసవిదామోదర్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,ధర్మ రెడ్డి, శివ రెడ్డి,మల్లారెడ్డి, రాము రెడ్డి, మోహన్ రెడ్డి, పద్మ రెడ్డి, అంజి రెడ్డి,యాదవ సంఘం సభ్యులు,NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking