ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు టి.యూ.డబ్ల్యూ.జె.యూ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఫ్తి రయిసుద్దీన్ మరియు కార్యవర్గ సభ్యుడు మొహమ్మద్ అబ్దుల్ అజీమ్ పరిశీలకులుగా వ్యవహరించారు. స్థానిక ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయం లో ఈ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. గౌరవ అధ్యక్షులు ఫహీమ్ అహ్మద్ ఖాన్ జిల్లా అధ్యక్షులు వసి ఉల్లా ఖాన్, ఉపాధ్యక్షులు ఖాజా అబ్దుల్ బసీర్, షేఖ్ పర్వేజ్, మీర్ వారిస్ అలీ, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజమ్మిల్, సహాయ కార్యదర్శి సయ్యద్ జాహిద్ హాష్మీ ఆర్గనైసింగ్ కార్యదర్శి సల్మాన్ షేఖ్ మరియు అహ్మద్ షా ఖాన్, కోశాధికారి మొహమ్మద్ అజహరుద్దీన్, ప్రచార కార్యదర్శి అబ్దుల్ అహద్. కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ లిసాన్ ఉల్ హఖ్, మొహమ్మద్ అబ్దుల్ అలీమ్, సయ్యద్ రహ్మత్, సయ్యద్ సర్ఫరాజ్, అలీమ్ ఉద్దీన్, హాఫిజ్ ఖైసర్ పాషా, మొహమ్మద్ ఫహీముద్దీన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఫ్తి రయీసుద్దీన్ మాట్లాడుతూ టి. యూ.డబ్ల్యూ.జె.యూ. సహకారం తో తెలంగాణ రాష్ట్రం లోని జర్నలిస్ట్ ల యొక్క సమస్యలను పరిష్కరించుటకు ఐక్యమత్యం తో సాధిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించి వారిని ఘనంగా సన్మానించారు.