అక్రమణలకు పాల్పడిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలి

 

-బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 15 :

మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమర్రి మున్సిపల్ పరిధిలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో రోడ్లు కాలువలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బడా వ్యాపారస్తులు రోడ్లు కాలువలను ఖాళీ స్థలాలను ఆక్రమిస్తూ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరామన్నారు. అలాగే రామకృష్ణ మెడికల్ షాప్ నుండి అజయ్ క్లాస్ స్టోర్ క్రింది వరకు గల పాత కాలువపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి కాలువను పునర్నిర్మాణం చెయ్యాలన్నారు. అన్ని షాపుల ముందు గల కాలువను ఆక్రమించడం వల్ల వర్షపు నీరు పోకుండా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలని,
స్టేట్ బ్యాంక్ ముందు గల కాళీ స్థలంలో ప్రజల సౌకర్యార్థం గ్రంథాలయాన్ని నిర్మించాలని కోరారు.
కూరగాయల మార్కెట్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి ముందుకు జరిపి నిర్మాణాలు చేసినందు వల్ల రద్దీ ఏర్పడి వినియోగదారులకు ఇబ్బంది కలుగుతున్నందున రోడ్డును వెడల్పు చేసి రద్దీని నివారించలన్నారు.
గంప శంకరయ్య జి మార్ట్, రాజయోగి షాపింగ్ మాల్ ప్రక్కన ప్రజల సౌకర్యార్థం విశాలమైన రోడ్లు ఉండేవి వాటిని ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మాణాలు చేసినారు వాటిని వెంటనే తొలగించగలన్నారు. వీరి వెంట బి.ఎస్.పి నాయకులు గాజుల శంకర్, ఎండి మతిన్ ఖాన్, బొర్లకుంట రాయలింగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking