రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 15 ఫిబ్రవరి 2025
భారత రాష్ట్ర సమితి మణికొండ సీనియర్ నాయకుడు బొమ్ము ఉపేందర్నాథ్ రెడ్డి ఆద్వర్యంలో ప్రియతమ నాయకుడు, రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు 17 ఫిబ్రవరిని దృష్టిలో పెట్టుకొని రాజేందర్ నగర్ నియోజవర్గ పరిధిలోని పెద్ద మంగళరంలోని హాట్ స్పాట్ క్రికెట్ స్టేడియంలో కె.సి.ఆర్ ట్రోఫీ నిర్వహించడం సందర్భంగా రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆటను మొదలుపెట్టడం జరిగినది, ఇందుకు గాను ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నీలకంఠం శివరామకృష్ణ, చావా సందీప్, తెల్ల జస్వంత్, ఒంటెద్దు రాజశేఖర్ రెడ్డి, షేక్ ఆరిఫ్ మహమ్మద్, బండారు ఉదయ్ కిరణ్ లు ఎంతో శ్రమకోర్చి సహకారాన్ని అందించారని, ఈ సందర్భముగా మొత్తం 14 జట్టులు: అవాస ప్రైడ్, గరుడా, వీ.టీ నైట్స్, ఎక్స్ట్రీమ్ 11, ఔరేలిలా అవెంజర్స్, వారియర్స్ XI, ఏస్ అట్లాంటిస్, జై భవాని, ఈగెల్స్, జై వీర్ హనుమాన్, జీ 2 స్ట్రైకర్స్ , జై హనుమాన్ XI, ఆల్ఫా XI, ఐరా స్పోర్ట్స్ ఆటలో పాల్గొన్నారని వారితో పాటు అతిథులుగా పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, విష్ణువర్ధన్ రెడ్డి, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, రామసుబ్బ రెడ్డి, బుద్దోలు బాబు, షేక్ ఆరిఫ్, దిలీప్, సుమనళిని, బొడ్డు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.