సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారికి మేము ఉన్నాం అనే భరోసా కలిగించాలి – జిల్లా ఎస్పి శ్రీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి

మెదక్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-
జిల్లా పోలీస్ ప్రధాన కార్యలయంలో నూతనంగా నియామకం అయిన పోలీస్ సిబ్బంది యొక్క మొదటి బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంనికి జిల్లా ఎస్పి శ్రీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పి శ్రీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు/ ఫిర్యాదులు/ సమాచారం/ సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారికి మేము ఉన్నాం అనే భరోసా కలిగించాలని అన్నారు. ప్రతి పౌరుడికి సమాన్యాయం జరిగేటట్లు చూడాలి అని అన్నారు. ప్రజలకు సత్వరన్యాయం జరిగడానికి సాంకేతిక వనరులను వినియోగించుకోవాలని అన్నారు. విదులలో మంచి ప్రతిభ కనబరిచి ప్రజల మన్ననలను పొందలన్నారు. ఆదేవిదంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవారుచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్ బి ఇన్స్పెక్టర్ శ్రీ.మధు సూధన్ గౌడ్ , శ్రీ అనిల్ CCTNS మరియు లక్ష్మీకాంత్ గారు, ఫాయాజ్ అలీ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking