— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .
మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి:- విద్యార్థులందరూ మంచి మార్కులతో పాస్ కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థుల సూచించారు.
శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలంలోని బురుగుపల్లి గ్రామంలో ఉన్న జడ్పీ హైస్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలోని తరగతి గదులను వంటగదిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు గణితం, సైన్సు, ఇంగ్లీషు పాఠాలు బోధించి అందులో వారి సందేహాలను నివృత్తి చేశారు.
తరగతి గదిలో విద్యార్థులను ఎక్కాలు ,ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చదివించారు.
పదో తరగతి విద్యార్థులు రివిజన్ చేశారా…? అని అడిగారు.
పరీక్షలకు వెళ్లేముందు మూడు నాలుగు సార్లు రివిజన్ చేయాలని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ చదువులో వెనక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు చతుర్విధ ప్రక్రియలో(L.S.R.W) నిష్ణార్థులు కావాలన్నారు.
విద్యార్థులందరూ ఉత్తమ మార్కులతో పాసై పాఠశాలకు తల్లిదండ్రులకు ,ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు.
సబ్జెక్టులలో ఎలాంటి సందేహాలు ఉన్న ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకోవాలన్నారు.
టీవీ ,ఫోన్, సోషల్ మీడియా లాంటి వాటికి పరీక్షల సమయంలో దూరంగా ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో విద్యార్థులందరూ జాయిన్ కావాలని విద్యార్థులను కోరారు.
తల్లిదండ్రులు పిల్లల పరీక్షల కాలంలో వారికి సహకరించాలన్నారు.
బూరుగుపల్లి పాఠశాలలో విద్యార్థులు ఉత్తమంగా చదువుతున్నారని అభినందించారు.
కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
