నిజాంపేటలో బాలుడు తేజస్​ మిథున్​రెడ్డి మృతికి కారకులపై చర్యలు

 

బాలుని మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ అభిషేక్​ అగస్త్య

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రతినిధి)సెప్టెంబర్ 6:
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఉన్న విష్ణుప్రియనగర్​లో మున్సిపల్​ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వరద నీటిని దారి మల్లించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు నాలా పైకప్పు తెరిచి ఉంచడం నాలుగేళ్ళ బాలుడు తేజస్​ మిథున్​రెడ్డి మృతి చెందారని అందుకు సంబంధించిన వారిని గుర్తించి వారిపై పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్​ అభిషేక్​ అగస్త్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విష్ణుప్రియనగర్​లోని తుర్క చెరువుకు అనుసంధానంగా ఉన్న నాలా పైకప్పును ఈనెల 5వ తేదీన వరద ఉదృత్తిని మళ్ళించేందుకు తెరిచి ఉంచడం వల్లే పైకప్పు దాటేందుకు తేజస్​ మిథున్​ రెడ్డి వెళ్ళగా అక్కడ నాలా తెరిచి ఉండటం వల్ల అందులో కొట్టుకుపోయి బాలుడు మృతి చెందారని అధికారులు, బాలుని తల్లిదండ్రులు తెలిపిన మేరకు అందుకు సంబంధించిన బాధ్యులను గుర్తించి పట్టుకొని వారిపై, అపార్టుమెంట్​పై కేసు నమోదు చేయాల్సిందిగా ఎఫ్​ఐఆర్​ చేయాల్సిందిగా బాచుపల్లి స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ (ఎస్​హెచ్​వో)కు జిల్లా అదనపు కలెక్టర్​ అభిషేక్​ అగస్త్య ఆదేశించారు. ఈ విషయంలో మృతుడు నాలుగేళ్ళ తేజస్​ మిథున్​రెడ్డి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు తన సంతాపం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking