బీసీ సింహగర్జన పోస్టర్ విడుదల చేసిన చీప్ విప్ వినయ్ భాస్కర్ బీసీలలో రాజకీయ చైతన్యం రావాలి

 బీసీలకు చట్ట సభలో రిజర్వేషనుల కోసం పోరాటం చెయ్యాలి

హైదరాబాద్ 06సెప్టెంబర్: హన్మకొండ కూడా కార్యలయం నందు సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్ లో జరిగే బీసీ సింహ గర్జన సభ పోస్టర్ ను ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గార్లు విడుదల చేశారు. ఈ సందర్బంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ జనాభాలో అత్యదిక భాగం 55% ఉన్న బీసీలు రాజకీయంగా చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ చట్ట సభలో రిజర్వేషన్ లేని కారణంగా బీసీలు రాజకీయంగా చాలా వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రములో త్వరలో జరగ బోయే శాసనసభ ఎన్నికల్లో బీసీల జనాభా ప్రకారం అన్ని పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని అన్నారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్స్ జరిగే బీసీల సింహగర్జనకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి బీసీ కులాలకు చెందిన ప్రజలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, ఎల్లయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల సంపత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కాసగాని అశోక్, జిల్లా కార్యదర్శి మారగోని రవి, బుర్ర శ్రీనివాస్, గడ్డం యాదగిరి, రంజిత్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking