ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ తో పాటు ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ ఆర్ ఎస్) ద్వారా భూములు క్రమబద్ధీకరణపై చేపట్టాల్సిన విధి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు సలహాలు అందించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీ పరిధిలోని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలన్నారు సూచించారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రభుత్వ భూములను కాపాడుతూనే ప్రభుత్వ అనుమతి లేని లేఅవుట్లు,ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా కమిటీలను రూపొందించాలని సూచించారు. క్రమబద్ధీకరణ క్రమంలో విధిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, భూముల క్రమబద్ధీకణపై జిల్లా, మండల,మున్సిపాలిటీ పరిధిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్,కిషోర్ కుమార్,ఆర్డీవో రత్నకళ్యాణి,డీపీవో శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ రాజు, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.