రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 04 ఆగస్టు 2024:
రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మణికొండ మునిసిపాలిటీ బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంఘం శ్రీకాంత్ ఆద్వర్యంలో యువజన విభాగం కార్యకర్తలు పార్టీ యువ నాయకులు కార్తీక్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని, ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మునిసిపాలిటి లో పార్టీ బలోపేతానికి పలు సూచనలు చేశారని, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెలిపినారు, చర్చలలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన యువజన విభాగం మొత్తం పార్టీ కొరకై అన్నివేళలా అందుబాటులో ఉంటుందని, మణికొండలో సీనియర్ నాయకులకు కొదువలేదని ప్రస్తుతం సీతారాం ధూళిపాళ అందరికి అందుబాటులో ఉంటున్నారని తెలియచేయడం జరిగింది, యువ నేతను కలిసిన వారిలో మల్లపురం శ్రీనివాస్, పుట్టపాగ ఎల్లాస్వామి, మహేష్ యాదవ్, శివ ముదిరాజ్ , చిన్నపగా హుస్సేన్, తిరుపతి, గట్టు చంద్రశేఖర్ గౌడ్, రవికుమార్, రవి ముదిరాజ్, విజయ్ ముదిరాజ్, మహారాన సతీష్, జి.బాలకృష్ణ, శ్రీనివాస్, ఉదయ్, రామాంజీ, బి.భాస్కర్, బి.తరుణ్, సంఘం ప్రశాంత్, అరుణ్, శ్రీకర్, నితీష్, మనోజ్, అనిల్, ఆదర్శ్, గణేష్, భరత్, చందు, లింగేశ్వర్, శ్రీనివాస్ తదితరులు కలరు.