బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 04 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలలోని బీజేపీ దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఆదివారం ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేద ప్రజలను మోసం చేసిందని అన్నారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు, నిరుద్యోగులకు 4వేల రూపాయల,రైతు కూలీలకు12,500 రూపాయలు, రైతు భరోసా 15 వేల రూపాయలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని అన్నారు. అదే విధంగా దండేపల్లి మండలంలో అనేక సమస్యలు నెలకొన్నాయని ఆ సమస్యల మీద ప్రశ్నిస్తే బీజేపీ నాయకుల మీద తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులను ఎన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన వెనకడుగు వేయకుండా నిరంతరం ప్రజల సమస్యల మీద మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అమలు చేసే వరకు నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,గుండా ప్రభాకర్, గాదే శ్రీనివాస్,బుసు నర్సింహులు, మోటపలుకుల గురువయ్య,కొండ నరేష్, బందేల రవి గౌడ్,ఎంబాడి సురేందర్, సిపిరిషెట్టి శ్రీనివాస్,జోగుల శ్రీదేవి, నందుర్క సుగుణ,అక్కల దివ్య, పిట్టల అశోక్, సత్యనారాయణ, బొర్లకుంట వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.