ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు4:
ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ లైబ్రరీ దగ్గర సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగుల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్వి విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పకపోవడం ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్న శ్రద్ద అర్థమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో అశోక్ నగర్ కి వచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులను రెచ్చగొట్టి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరాని 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తం అని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. ఉద్యోగాల పేరిట తెలంగాణ యువతను మోసం చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కి మొదటి క్యాబినెట్ లో చట్టబద్ధత కల్పిస్తాం అని చెప్పి విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలతో ఏ ఏ శాఖల లో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయని సంఖ్యతో జాబ్ జాబ్ క్యాలెండర్ వచ్చేవరకు నిరుద్యోగులపక్షనా బిఆర్ఎస్వి పోరాడుతుంది అన్నారు.