మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి…

– ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 11

మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న మీడియాకు జవాబుదారిగా ఉండాల్సిన వ్యక్తులు అసహనంతో బౌతికదాడులకుపాల్పడడం సరైంది కాదని ఫెడరేషన్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహాన్, ఏబూసి. సంపత్ లు పేర్కొన్నారు. సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో పనిచేస్తారని, అలాంటి మీడియా ప్రతినిధులపై దాడీ చేసిన మోహన్ బాబు మీడియా కు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking