అదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ప్రతి ఒక్కరుకృషి చేయాలి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు సోమవారం లక్ష్మణ్ చందా మండలంలోని రాచాపూర్ గ్రామంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేయాలని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను చైతన్య పరచాలని సూచించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking