బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్,మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 05 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్,మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి ఆధ్వర్యంలో సోమవారం రోజున బిఆర్ఎస్ నుండి 6 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు 2 వ వార్డ్ షేక్ అప్సర్,4 వ వార్డ్ ఆస్మా యూసుఫ్,18 వ వార్డ్ గురుండ్ల సత్యనారాయణ,10 వ వార్డు కొక్కెర చంద్రశేఖర్,22 వ వార్డు గడ్డం అశోక్ గౌడ్,34వ వార్డు చిట్యాల లక్ష్మి మధు,లను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బండి ప్రభాకర్ యాదవ్,పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్,చైర్మన్ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ సెల్ బీసీ సెల్ యూత్ కాంగ్రెస్ మైనార్టీ ఎన్ ఎస్ యూ ఐ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.