కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆర్ పి ఐ పార్టీ

పెద్దపల్లి లో గడ్డం వంశీ కృష్ణని బారి మెజార్టీతో గెలిపించండి

ఆర్ పి ఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బల్లెపు మహేష్ బాబు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 06 : మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆర్ పి ఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బల్లెపు మహేష్ బాబు మాట్లాడుతూ…‌ కాంగ్రెస్ పార్టీకి ఆర్ పి ఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.డా,,బాబా సాహెబ్ అంబెడ్కర్ ఆశయ సాధనకు కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.కాబట్టి మతతత్వా పార్టీ లకు కాకుండా రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎన్నో నూతన సంస్కరణలకు ఆద్యుడు గడ్డం వెంకట స్వామి(కాక)మనుమడు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్. పి.అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. రాజ్యాంగ ఫలాలు అందరికి దక్కాలంటే బి జె పి పార్టీని ఓడించాలని కోరారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన గత 10 ఏళ్లలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని అన్నారు.జే ఎన్ యు లాంటి విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లను అర్బన్ నక్సలైట్ల పేరుతో అణచివేస్తూ, హక్కుల కోసం పోరాడుతున్న దళిత విద్యార్థులను, రోహిత్ వేముల లాంటి మేధావులను ఆత్మహత్యలకు పూరిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి రాబోయే ఎన్నికలలో 400 సీట్లు పైన సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో మను స్మృతిని తీసుకొస్తామని బహిరంగంగా బిజెపి ఎం.పీ లే ప్రకటిస్తున్నారు. కాబట్టి.రాజ్యాంగాన్ని రక్షించుకోవలచిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు.రాజ్యాంగాన్ని మార్చటం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బి సి రిజర్వేషన్లు తొలగించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గత పది ఏళ్లలో ప్రభుత్వ సంస్థల్ని అదాని, అంబానీ లాంటి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో రకాల ప్రభుత్వ సంస్థలు ప్రజల శ్రేయస్సు కోసం స్థాపించబడితే, బి జె పి. ప్రభుత్వం వీటన్నిటిని వ్యాపారవేత్తలకు కట్టబెట్టటమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తున్నదని తెలిపారు. ప్రజల మధ్య మతం పేరుతో బిజెపి విద్వేషాన్ని నింపుతున్నదాని అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్.దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ…ఇప్పుడు ఉన్న సమయంలో దేశాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆర్.పి.ఐ పార్టీ భావిస్తున్నాదాని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో మేమంతా పని చేస్తున్నాం.కాబట్టి ప్రజలందరికి మేము విజ్ఞప్తి చేస్తావున్నాం త్వరలో జరగబోవు పార్లమెంటు ఎన్నికలలో మతతత్వ బిజెపిని,అవినీతి కుటుంబ పార్టీ అయినా బి ఆర్ ఎస్ పార్టీ ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సి హెచ్ బాలకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్ దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking