గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ గెలిపించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 06 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలో 58 వ వార్డు లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించడం కోసం గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది.సోమవారం ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమల రాజు మాట్లాడుతూ…ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు వెంకట్రావుపేట గ్రామంలోని 58 వ వార్డు లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్నారు 6 గ్యారంటీ పథకాల గురించి ఓటర్ల కు అవగాహన కల్పించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ని అత్యధిక మెారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడమైనది.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీని అధ్యక్షులు నలిమెల రాజు,మండల యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నిమ్మధి మాజీ వార్డు మెంబర్ తోట రాజయ్య మరియు కల్లూరి అశోక్ పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking